ప్రైజ్ మనీ ఎంతంటే.?

Kalyan Becomes Bigg Boss Winner: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాల (Kalyan Padala) నిలిచారు. నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున విజేతను ప్రకటించారు. ఈ సీజన్ విజేతకు సంబంధించిన కళ్యాణ్ పడాల (ఈయన ఒక సామాన్యుడిగా/జవాన్‌గా హౌస్‌లోకి ప్రవేశించి టైటిల్ గెలుచుకున్నారు.రన్నరప్ గా తనూజ పుట్టస్వామి నిలిచారు.కళ్యాణ్ పడాల మొత్తంగా రూ. 40 లక్షల నగదు (రూ.35 లక్షలు విన్నర్ ప్రైజ్ + రూ.5 లక్షలు స్పెషల్ పెర్ఫార్మర్ అవార్డు) , ఒక కొత్త SUV కారును గెలుచుకున్నారు.

టాప్ 3 కంటెస్టెంట్లలో ఒకరైన డీమాన్ పవన్ రూ.15 లక్షల నగదు ఉన్న సూట్‌కేస్‌ను తీసుకుని రేసు నుండి తప్పుకున్నారు. టాప్ 5లో మిగిలిన కళ్యాణ్, తనూజ, పవన్, ఇమ్మాన్యుయేల్. సంజన నిలిచారు.

బిగ్ బాస్ చరిత్రలో ఒక సామాన్యుడు విజేతగా నిలవడం ఇది రెండోసారి.

ఈ ఫినాలే వేడుకకు రవితేజ బృందంతో పాటు, ‘ఛాంపియన్’ చిత్ర బృందం రోషన్, అనస్వర రాజన్, శ్రీకాంత్, ‘అనగనగా ఒక రాజు’ హీరోహీరోయిన్లు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరిలు విచ్చేసి షోలో వినోదాన్ని రెట్టింపు చేశారు. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి తన కామెడీతో హౌస్ మేట్స్‌ను నవ్వించారు.

ఈ సీజన్ కోసం నిర్వహించిన 'అగ్నిపరీక్ష' అనే స్పెషల్ షో ద్వారా వేలాది మంది అప్లికేషన్లను వడపోసి కల్యాణ్‌ను ఎంపిక చేశారు. సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్ అయిన కల్యాణ్‌కు సినిమాలంటే ప్రాణం. కానీ పేదరికం, ఆర్థిక ఇబ్బందుల వల్ల తన కలను పక్కన పెట్టి దేశ సేవలో చేరారు. అయితే, బిగ్‌బాస్ ఇచ్చిన అవకాశాన్ని ఒక యుద్ధంలా భావించి హౌస్‌లోకి అడుగుపెట్టారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story