Kamal Haasan’s Praise: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ‘దళపతి’ విజయ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నటుడు రాష్ట్ర అత్యున్నత పీఠాన్ని అధిరోహించడంపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశించారు.

ఈ నిర్ణయంపై స్పందించిన కమల్ హాసన్.. విజయ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఒక నటుడు ముఖ్యమంత్రి కావడం గర్వంగా ఉంది.. అయితే ఇప్పుడు విజయ్‌ను కేవలం ఒక యాక్టర్‌గా మాత్రమే చూడవద్దు.. ఆయన భుజాన ఇప్పుడు రాష్ట్ర బాధ్యత ఉంది అని కమల్అన్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, గుడుల వద్ద మద్యం దుకాణాలను తొలగించాలన్న నిర్ణయం ప్రశంసనీయమని, ఈ మార్పు నిరంతరాయంగా కొనసాగాలని ఆయన కోరారు. తమిళ రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విజయ్.. తనదైన శైలిలో పాలనను ప్రారంభించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story