ఎవరి బయోపిక్ కాదు: రానా

Rana: రానా దగ్గుబాటి దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించి.. నిర్మించిన చిత్రం 'కాంత' (Kaantha). ఈ సినిమా రిలీజ్ సందర్భంగా (నవంబర్ 14న), రానా దగ్గుబాటి ప్రమోషన్లలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నప్పటికీ, ప్రధానంగా కథ ఒక గురు-శిష్యుల మధ్య ఉన్న భావోద్వేగ ఘర్షణ గురించి ఉంటుందని రానా స్పష్టం చేశారు."అసలు సినిమా కథ గురు-శిష్యుల మధ్య నడిచే భావోద్వేగ ఘర్షణ గురించే. ఇది కేవలం ఇండస్ట్రీ గురించి ఉన్న సినిమా కాదు," అని తెలిపారు.

ఈ కథ ఏ ఒక్క నిజ ఘటన ఆధారంగా తీసింది కాదని, తాము అనేక సంఘటనల నుండి స్ఫూర్తి పొందామని చెప్పారు. ఈ సినిమా ఎవరినీ టార్గెట్ చేసే ఉద్దేశంతో తీసింది కాదని తేల్చి చెప్పారు.ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా కావడంతో, దుల్కర్‌ను ఈ పాత్రకు ఎంచుకోవడానికి గల కారణాన్ని రానా తెలిపారు."ఇలాంటి పీరియడ్ సినిమాకి దుల్కర్ సల్మాన్ లాంటి 'రెట్రో కింగ్' పర్ఫెక్ట్. ఆ పాత్రను అతను అద్భుతంగా పోషించారు," అని పొగిడారు.

రానా తన బాల్యం ,సినీ కెరీర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకుంటూ, తాను చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు స్టూడియోలలో జరిగే విషయాలు చాలా తక్కువ మందికి తెలిసేవని, దర్శకుడు సెల్వ ఈ కథ చెప్పినప్పుడు ఆ అరుదైన బ్యాక్‌డ్రాప్ తనకు బాగా నచ్చిందని, అందుకే సినిమా చేయాలనిపించిందని తెలిపారు.

Updated On 13 Nov 2025 11:21 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story