Kantara Chapter 1 Box Office Storms: దుమ్ము లేపుతోన్న కాంతార చాప్టర్ 1 వసూళ్లు... కన్నడలోనే సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్లు
కన్నడలోనే సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్లు

Kantara Chapter 1 Box Office Storms: రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. రిలీజైన్ రోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమా విడుదలైన రెండు వారాళ్లోనే ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా (సుమారు రూ. 717 కోట్ల గ్రాస్) ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిలిమ్స్' ట్రేడ్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
భారతదేశంలో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్ రూ. 485 కోట్ల మార్కును దాటి, త్వరలో రూ. 500 కోట్ల నెట్ మార్కును చేరుకునే దిశగా ఉంది తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ. 100 కోట్ల నుంచి రూ. 105 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. హిందీ వెర్షన్ వసూళ్లు కూడా చాలా బలంగా ఉన్నాయి, సుమారు రూ. 146 కోట్ల నుంచి రూ. 164 కోట్ల వరకు నెట్ కలెక్షన్ సాధించినట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది1200 కోట్లకు పైగా వసూళ్లతో కేజీఎఫ్ 2 తొలి స్థానంలో ఉంది.
