Actress Meena: కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు..రెండో పెళ్లి వార్తలపై నటి మీనా ఫైర్
రెండో పెళ్లి వార్తలపై నటి మీనా ఫైర్

Actress Meena: తన భర్త విద్యాసాగర్ 2022లో ఊపిరితిత్తుల సమస్యలతో చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ నటి మీనా భావోద్వేగానికి గురైంది. ఆ బాధ నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదని తెలిపింది. ప్రస్తుతం తనకూతురే తన ప్రపంచం అని స్పష్టం చేసింది. భర్త మరణించిన కొన్ని రోజులకే తనపై పెళ్లి పుకార్లు రాయడం మొదలైందని, అప్పట్లో పట్టించుకోలేదని, తన మౌనాన్నిబలహీనతగా తీసుకుంటే ఎలా అని ప్రశ్నించింది.
తానొక సెలబ్రిటీనని, భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న స్త్రీని అని, అందుకే తనను ఈజీగా టార్గెట్ చేస్తున్నారా అంటూ మండిపడింది.ఈ వార్తలను ఇప్పటికే పలుమార్లు ఖండించినప్పటికీ మళ్లీ మళ్లీ అదే కథలు రాయడంఎందుకో అర్థం కావడం లేదంది. ఫ్రెండ్స్ ఫోన్ చేసి పెళ్లి గురించి అడగడం తన గుండెను గాయపరుస్తోందని, ఇలాంటి ఫేక్ వార్తలు తన ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను చాలా పాజిటివ్ పర్సన్ ను అని, ఇక మీదట ఇలాంటి వాటి గురించి తన టైమ్, ఎనర్జీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకో దలచుకోలేదని, కర్మ అనేది ఒకటి ఉంటుందని, అది ఎవరినీ వదిలిపెట్టదని తెలిపింది.

