Katrina Kaif : సుమారు రెండు దశాబ్దాలుగా వెండితెరపై తనదైన అందం, అభినయం, అదిరిపోయే యాక్షన్ విన్యాసాలతో అగ్ర తారగా వెలుగొందుతున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు రెండేళ్లుగా మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తూ సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు బి-టౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

మా సీక్వెల్‌లో కాజోల్‌తో కలిసి స్క్రీన్ షేరింగ్?

గతంలో విడుదలైన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ కథానాయిక కాజోల్ ప్రధాన పాత్రలో మెప్పించిన ఈ సినిమాకు ఇప్పుడు మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. మా 2లో కాజోల్‌తో పాటు కత్రినా కైఫ్ మరో కీలక నాయికగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర బృందం ఇప్పటికే కత్రినాతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసిందని, కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇద్దరు స్టార్ హీరోయిన్లు కాజోల్, కత్రినా కైఫ్ తొలిసారి కలిసి నటించనున్నారనే వార్త సినీ ప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Next Story