Keeravani Praises: శ్రీ చిదంబరం గారు టీంపై కీరవాణి ప్రశంసలు
కీరవాణి ప్రశంసలు

Keeravani Praises: శ్రీ చిదంబరం గారు సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 4, 2026న జరిగిన ఈ వేడుకలో ఆయన ఒక ప్రత్యేక అతిథిగా పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు.
"ఈ సినిమాను ఒక యువ బృందం ఎంతో ఉత్సాహంతో, కష్టపడి రూపొందించింది. ఇలాంటి 'యంగ్ బ్లడ్' చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది," అని ఆయన కొనియాడారు. తన కెరీర్ ఆరంభం గుర్తు చేసుకుంటూ: "ప్రతి ఒక్కరూ పుట్టడమే సెలబ్రిటీలుగా పుట్టరు. అందరూ కష్టాల నుంచే వస్తారు. నేను మొదట్లో ప్లేబ్యాక్ సింగర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను, కానీ అది కష్టమని తెలిసి బతుకుదెరువు కోసం సంగీత దర్శకుడిగా మారాను," అని తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమా టీజర్, విజువల్స్ , క్యారెక్టర్స్ చాలా సహజంగా ఉన్నాయని, హీరో కేవలం 'హీరోయిజం' కోసమే కాకుండా, ప్రేక్షకులకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేలా తన పాత్రను పోషించాడని ఆయన మెచ్చుకున్నారు.
ఈ వేడుకలో కీరవాణి ఈ సినిమా కోసం తాను పాడిన 'వెళ్లేదారిలో' అనే పాటను లైవ్‌లో పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఒక యంగ్ టీమ్ చేస్తున్న సినిమా కోసం ఆయన పాట పాడటం , ఈవెంట్‌కు రావడం ఆ చిత్ర బృందానికి పెద్ద బూస్ట్‌ని ఇచ్చింది.

