'Satyavan Savitri': మహానటి కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో వస్తున్న సరికొత్త కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ‘సత్యవన్ సావిత్రి’. ప్రవీణ్ ఎస్. విజయ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. బుధవారం ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ ఇస్తూ.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ కోయిన్సిడెన్స్ ఉంది.

నిజానికి ఇదే జులై 24వ తేదీన.. రాజ్ కుమార్ రావ్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘రఫ్తార్’ రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను అక్టోబర్ 16కు వాయిదా వేశారు. అలా హిందీ సినిమా వాయిదా పడిన అదే డేట్‌కు.. అనూహ్యంగా కీర్తి నటించిన తమిళ చిత్రం ‘సత్యవన్ సావిత్రి’ థియేటర్లలోకి వస్తోంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్.. తన భర్త కేసును వాదించే పవర్‌ఫుల్ లాయర్ 'సావిత్రి'గా కనిపించనుంది. న్యాయం కోసం తన సీనియర్ లాయర్ అయిన తమిళ వెర్సటైల్ డైరెక్టర్ మిస్కిన్‌తో ఆమె కోర్టు రూమ్‌లో తలపడనుంది. కీర్తి, మిస్కిన్ మధ్య వచ్చే కోర్ట్‌రూమ్ డ్రామా సీన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నాయి.

హార్ట్ బీట్’ సిరీస్ ఫేమ్ చారుకేష్ ఇందులో కీర్తికి భర్తగా నటిస్తుండగా.. బాల శరవణన్, శిల్పా మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సి.ఎస్ ఈ చిత్రానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డ్రమ్ స్టిక్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్ధన్’ చిత్రంతో పాటు మలయాళంలో ‘తోట్టం’ లాంటి సినిమాలతో బిజీగా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story