దర్యాప్తులో కీలక విషయాలు

iBomma Ravi Case Investigation: ఐ-బొమ్మ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమండి రవిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. నాంపల్లి కోర్టు అనుమతితో రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా, పైరసీ నెట్‌వర్క్‌తో పాటు, రవి వ్యక్తిగత జీవితంలో ఉన్న అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కారణంగా రవి మనుషులంటే నమ్మకం కోల్పోయి, సుమారు నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నట్టు పోలీసులు తేల్చారు. అమీర్‌పేట్‌లోని కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన ఓ యువతిని రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. ఏడాది పాటు సంతోషంగా ఉన్న వారి కాపురంలో ఆర్థిక ఇబ్బందులు చిచ్చు పెట్టాయి.రవి డబ్బు సంపాదించలేకపోతున్నాడని అతని భార్య తరచుగా ఎగతాళి చేసేదట. తన అక్క, బావ విదేశాల్లో కోట్లు సంపాదిస్తున్నారని పోల్చి మాట్లాడటంతో పాటు, అత్త కూడా ఆమెకు వంతపాడడంతో గొడవలు పెరిగాయి. ఈ కలహాలు విడాకుల వరకు దారితీయడంతో, భార్య కూతురిని తీసుకుని వెళ్లిపోయింది.కూతురిని చూడటానికి అవకాశం కూడా లేకపోవడంతో రవి తీవ్ర ఒంటరితనానికి లోనయ్యారు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితోనే పైరసీ, గేమింగ్, బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు నడుపుతూ విదేశాలకు తిరగడం మొదలుపెట్టాడు.ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. పైరసీ ద్వారా వచ్చిన డబ్బుకు సంబంధించి మనీలాండరింగ్ జరిగిందని అనుమానిస్తూ, రవి బ్యాంకు ఖాతాల నుంచి రూ. 3.5 కోట్లకు పైగా డబ్బును స్తంభింపజేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story