నిజమెంత?

KGF 3 Prashanth Neel: బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్ సిరీస్‌లోని మూడో భాగం కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్‌లో ఇచ్చిన హింట్ కారణంగా ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అందులో కేజీఎఫ్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అని ఉంది. ఈ పోస్టర్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారని ప్రచారం జరిగింది.

ఈ వార్త రాకింగ్ స్టార్ యశ్ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. అయితే ఈ పోస్టర్ ఫేక్ అని, ఇది ప్రశాంత్ నీల్ అధికారిక ఖాతా నుంచి రాలేదని సినీ వర్గాలు ధృవీకరించాయి. ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. కేజీఎఫ్ 3 గురించి చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్‌తో సలార్ 2 చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు పెద్ద చిత్రాలు పూర్తయిన తర్వాతే కేజీఎఫ్ చాప్టర్ 3 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఈ సినిమా మొదలవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story