కేజీఎఫ్ బ్యూటీ

KGF Beauty to Star Opposite Venky: కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి తెలుగులో వరుస ప్రాజెక్టులు చేస్తోంది. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డకు జంటగా ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే..లేటెస్ట్ గా మరో క్రేజీ సినిమాలో ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకుంది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో శ్రీనిధి శెట్టి కన్ఫర్మ్ అయ్యింది. వెంకటేష్ కెరీర్‌లో ఇది 77వ చిత్రం (Venky77).హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 21) చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, వెంకటేష్‌తో జతకట్టడం ఇదే మొదటిసారి.

శ్రీనిధి శెట్టి నటి , మోడల్. ఆమె ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో పనిచేస్తున్నారు. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ఆమె.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (జైన్ యూనివర్సిటీ, బెంగళూరు) చేసింది. ఆమె అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అందాల పోటీ విజేతగా నిలిచింది. మిస్ సుప్రానేషనల్ (Miss Supranational) 2016 కిరీటాన్ని గెలుచుకుంది. ఈ టైటిల్‌ను గెలిచిన రెండవ భారతీయ మహిళగా ఆమె నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story