Khushbu: సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ, ప్రముఖ దర్శకుడు సి. సుందర్ ల పెద్ద కుమార్తె అవంతిక సుందర్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. జూన్ 25వ తేదీ గురువారం నాడు.. శ్రవణ్ శ్రీనివాసన్ మెడలో మూడు ముళ్లు వేసి అవంతికను తన అర్ధాంగిగా చేసుకున్నారు.గోవాలోని ఒక అందమైన లగ్జరీ రిసార్ట్ ఈ అద్భుత వేడుకకు వేదికైంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు, స్నేహితుల మధ్య.. ప్రకృతి ఒడిలో ఈ వివాహ బంధం ముడిపడింది.

ఈ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి దిగ్గజ నటీనటులు, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. మన టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ లతో పాటు పలువురు తారలు ప్రత్యేకంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు ఈ పెళ్లి సంబరాలకు సంబంధించిన మరికొన్ని బ్యూటిఫుల్ పిక్స్‌ను నటి ఖుష్బూ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు."ప్రస్తుతం తాము అనుభూతి చెందుతున్న ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు, భావోద్వేగాలు సరిపోవడం లేదు" అని ఖుష్బూ అన్నారు. "పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని తాము నమ్ముతామని.. కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రేమానురాగాల మధ్య జరిగిన ఈ వేడుక తమ హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుందని" ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాదు, "అవంతిక, శ్రవణ్ లు తమ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని.. వీరి వైవాహిక జీవితం ఆనందంగా, ప్రేమతో సాగిపోవాలని కోరుకుంటూ.. అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు తమ పిల్లలకుండాలని" ఖుష్బూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story