ఈ డ్రెస్సులోనే కంఫర్ట్..

Khushi Mukherjee: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రయత్నం. అలాంటి ప్రయత్నమే చేసింది టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఖుషీ ముఖర్జీ. ఇటీవల ఈ భామ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు ధరించిన డ్రెస్ ప్రస్తుతం ఆమెకు విమర్శలు తెచ్చి పెడుతోంది. ఒంటిపై ప్యాంట్ కాదు కదా చెడ్డీ కూడా వేసుకోలేదన్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కావడంతో చాలా మంది తీవ్ర పదజాలంతో ఆమెను విమర్శించడం మొదలు పెట్టారు. చెడ్డీ లేకుండా రోడ్డు మీదకు ఎలా వస్తావంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ విమర్శలకు ఖుషీ ముఖర్జీ సమాధానం చెప్పింది.

తనకు పద్దతులు నేర్పించాల్సిన అసవరం లేదని పేర్కొంది. తాను ట్రాన్ఫరెంట్ ప్యాంట్ ధరించినట్లు చెప్పిన భామ.. తాను చెడ్డీ వేసుకున్నదీ.. లేనిదీ... మీకెలా తెలుసంటూ విమర్శకులను ప్రశ్నించింది. 'నాకు కంఫర్ట్ ఉండటం వల్లే ఆ డ్రస్ ధరించాను. నా శరీరం ఎంత వరకు చూపించాలో నాకు బాగా తెలుసు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వివాదం జరుగుతుందని తెలిసే కేవలం పాపులారిటీ కోసమే ఆమె ఇలా చేసి ఉంటుందని మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. బిగ్ బాస్ వంటి షోల్లో ఎంట్రీ పక్కా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రస్తు తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story