Kiara Advani: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తాజాగా ముంబైలో జరిగిన 'GQ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ 2026' వేడుకలో సందడి చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో ఆమె ధరించిన దుస్తుల కంటే, ఆమె మెడలోని ఒక ఆభరణం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఫ్యాషన్ వర్సెస్ విశ్వాసం

ఈ వేడుక కోసం కియారా బ్లాక్ లెదర్ బస్టియర్ దుస్తులను ఎంచుకున్నారు. తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఆమె ప్రముక లగ్జరీ బ్రాండ్ 'క్రోమ్ హార్ట్స్' (Chrome Hearts) కి చెందిన ముత్యాల హారాన్ని ధరించారు. అయితే ఆ హారానికి 'క్రాస్' (Cross) ఆకారంలో ఉన్న పెండెంట్ ఉండటమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. కియారా హిందూ నేపథ్యం కలిగిన వ్యక్తి అయి ఉండి, ఇలా క్రైస్తవ మత చిహ్నాన్ని ధరించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

నెటిజన్ల వాదనలు

సోషల్ మీడియాలో కొంతమంది ఆమె సింధీ మూలాలను, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో జరిగిన వివాహ వేడుకలను ప్రస్తావిస్తూ ఆమె ఎంపికను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఫ్యాషన్ ప్రియులు మాత్రం కియారాను వెనకేసుకొస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో 'గోతిక్' (Gothic) స్టైల్ కోసం ఇలాంటి క్రాస్ చిహ్నాలను సాధారణంగా ఉపయోగిస్తారని, దీనికి మతపరమైన అర్థం వెతకాల్సిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. ఇటీవల దక్షిణాది నటి త్రిష కారులో కూడా ఇలాగే క్రాస్ కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

తల్లిగా ప్రమోషన్.. మళ్ళీ షూటింగ్ బిజీలో..

గత ఏడాది (2025) కుమార్తె సారాయా (Saraayah) కు జన్మనిచ్చిన తర్వాత కియారా దాదాపు ఆరు నెలల పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి వరుస ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తన మాతృత్వం గురించి స్పందిస్తూ, బిడ్డ పుట్టిన తర్వాత తానొక 'ఆడపులి' (Tigress) లాగా మారిపోయానని, జీవితాన్ని చూసే కోణం మారిందని ఆమె వ్యాఖ్యానించారు.

రాబోయే చిత్రాలు

వృత్తిపరంగా కియారా ప్రస్తుతం అత్యంత భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కన్నడ స్టార్ యశ్‌తో కలిసి ఆమె నటిస్తున్న “టాక్సిక్” (Toxic) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు హృతిక్ రోషన్ సరసన ‘వార్ 2’, రణవీర్ సింగ్‌తో ‘డాన్ 3’ వంటి క్రేజీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story