ఒకే రోజు రెండు సినిమాలు

Kishkindhapuri OTT Release Date Fixed: ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద థియేటర్ల దగ్గర సందడి వాతావరణం బాగా తగ్గింది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే మూడు రోజుల తర్వాత కూడా నిలబడగలిగాయి. అలాంటి పరిస్థితుల్లో, క్రితం నెలలో ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలు తమ జోరు చూపించి ప్రేక్షకులను ఆకర్షించాయి. ఆ రెండు చిత్రాలు.. ఒకటి మిరాయ్ కాగా, మరొకటి కిష్కింధపురి

ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్‌కు చెందినవే అయినా,రెండూ విజయం సాధించాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఒకే రోజున OTT ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి.

OTT లో విడుదల వివరాలు

సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన మిరాయ్ ఈ నెల 10 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. హారర్ టచ్‌తో సాగే కిష్కింధకాండ చిత్రం అదే రోజు నుంచి జీ5 లో అందుబాటులోకి రానుంది.

కిష్కింధపురికి మంచి రెస్పాన్స్

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన కిష్కింధపురి విడుదలైనప్పటి నుంచే అందరి దృష్టిని ఆకర్షించింది. పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సినిమా చూసిన వారు కూడా కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం కేవలం 10 రోజులలో రూ.30 కోట్లకి పైగా వసూలు చేసి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా సోలో రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉంటే మరింత పెద్ద విజయం సాధించి ఉండేదనే టాక్ కూడా వినిపించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story