రీ రిలీజ్ ఎపుడంటే.?

Kodama Simham Re-release: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'కొదమ సింహం' సినిమా నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది.ఈ సినిమాను 4K కన్వర్షన్ మరియు కొత్త డిజిటల్ 5.1 సౌండింగ్‌తో థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇది 1990లో విడుదలైన కౌబాయ్ చిత్రం.35 ఏళ్ల తర్వాత ఇప్పుడీ సినిమా రీ రిలీజ్‌‌‌‌కు రెడీ అవుతోంది. ఈ నెల 21న విడుదల కాబోతోంది. బుధవారం ఈ రీ రిలీజ్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రం 'కొదమ సింహం'. ఇది ఆయన నటించిన ఏకైక కౌబాయ్ సినిమా. యాక్షన్, అడ్వెంచర్, వెస్ట్రన్ (కౌబాయ్) జోనర్ లో వచ్చిన ఈ సినిమా 1990, ఆగస్టు 9న రిలీజ్ అయ్యింది. ఇపుడు ఈ చిత్రాన్ని 4K కన్వర్షన్ ,5.1 డిజిటల్ సరౌండ్ సౌండ్‌తో నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నారు.

కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించగా.. కైకాల నాగేశ్వరరావు (రమా ఫిల్మ్స్) నిర్మించారు. రాజ్-కోటి మ్యూజిక్ అందించారు. చిరంజీవి, సోనమ్, రాధ, వాణీ విశ్వనాథ్, మోహన్ బాబు (సుడిగాలి పాత్రలో).

నటించారు. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. దీనిని హిందీలో 'మై హూ ఖిలాడియో కా ఖిలాడి' గా, ఆంగ్లంలో 'హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్' గా డబ్ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story