నాకు పునర్జన్మనిచ్చింది: పవన్

AP Deputy CM Pawan Kalyan: కొండగట్టు తనకు పునర్జన్మని చ్చిందని, అంజన్నే తనను విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడాడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అంతకు ముందు వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. కొండగట్టు ఆలయంలో వసతులు కల్పించాలని తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకు టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, ఆనంద్ సాయి, చైర్మన్ బీఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారా యణ రెడ్డి సమష్టిగా నిర్ణయం తీసుకుని సీఎంచంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఆయన మంచి మనసుతో దైవ కార్యక్రమా నికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి అంటే తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు. అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం ఉందన్నారు. ఆయనకు అంజన్న ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కొండగట్టులో గిరి ప్రదక్షణ ఏర్పాట్లకు తాను సహకరిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story