Varun Tej: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం 'కొరియన్ కనకరాజు'తో ఆయన రీఎంట్రీ ఇస్తుండగా, ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ గ్యాప్ కావాలని తీసుకున్నది కాదని, ఎలాంటి పాత్రలు చేయాలనే దానిపై స్పతత తెచ్చుకోవడానికే రెండేళ్లు పట్టిందని తెలిపారు. ఇండో-కొరియన్ హారర్ కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాను టాలీవుడ్‌లో ఇంతకుముందు ఎవరూ ట్రై చేయలేదని, కథ నచ్చడంతోనే వెంటనే ఓకే చెప్పానని వరుణ్ వెల్లడించారు.

ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో వినోదాత్మకంగా ఉంటుందని, అయితే అనంతపురం రాయలసీమ యాస నేర్చుకోవడం, కొరియన్ భాషలో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం తనకు కొంచెం సవాల్‌గా అనిపించిందని చెప్పారు. కొరియన్ భాష తెలియకపోవడంతో ఆ పదాలు పలకడం ఇబ్బందిగా అనిపించినా, ఈ పాత్ర కోసం జుట్టు పెంచి సరికొత్త లుక్‌లో కనిపించానన్నారు.

వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాము ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించామో, థియేటర్లలో ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారని వరుణ్ ధీమా వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story