ఈ నెల 24న రిలీజ్...

Kota’s Final Film: కోట శ్రీనివాస రావుకు టాలీవుడ్ కన్నీటి వీడ్కోలు పలికింది నాలుగు దశాబ్దాల తన సినీ కెరీరో 750 కిపైగా సినిమాలు చేసిన కోట శ్రీనివాస రావు చనిపోయే వరకు నటించారు. మెగాస్టార్ చిరంజీవ ప్రాణం ఖరీదుతో వెండితెరకు పరిచయం అయిన కోట.. చివరిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లులో నటించారు. ఈ నెల 24న పవన్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ హరిహర వీరమల్లు థియేటర్లలోకి రానుంది.

కోట శ్రీనివాస రావు చాలా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేస్తూ.. పెద్ద గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే కుదరదు. ఆవగింజత అదృష్టం కూడా ఉండాలి. ఆ కోవలోనే నేను ప్రేక్షకులను మెప్పించగలిగానని ఆయన చెప్పేవారు. చచ్చేదాకా నటించాలి.. చచ్చిన తర్వాత నటుడిగా బ్రతకాలి అనేది ఆయన కోరిక. ఆయన కోరుకున్నట్టుగానే ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు సినిమా ఉన్నంతకాలం జీవించే ఉంటారు కోట శ్రీనివాస రావు.

PolitEnt Media

PolitEnt Media

Next Story