Krithi Shetty: కృతి శెట్టికి జాక్‌పాట్.. అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌లో లక్కీ ఛాన్స్?
అనిల్ రావిపూడి మల్టీస్టారర్‌లో లక్కీ ఛాన్స్?

Krithi Shetty: 'ఉప్పెన' సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన కృతి శెట్టి, గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. ఆమె నటించిన 'ది వారియర్', 'కస్టడీ', 'మనమే' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక గత ఏడాది తమిళంలో కార్తీ సరసన చేసిన 'వా వాతియార్' కూడా పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న తమిళ ప్రాజెక్ట్ 'LIK' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఏప్రిల్ 3, 2026న విడుదల కావాల్సి ఉన్నా, దాని విడుదలపై ఇంకా కొన్ని సందిగ్ధతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి మళ్లీ మంచి రోజులు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మధ్యలో మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో కృతి శెట్టి కూతురు పాత్రలో నటించనుందనే వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ మార్పులు లేదా ఇతర కారణాల వల్ల ఆమెకు ఆ అవకాశం దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఈ దశలో కృతికి ఒక బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి మల్టీస్టారర్ చిత్రంలో కృతి శెట్టిని ఒక హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లో కళ్యాణ్ రామ్ సరసన కృతిని నటింపజేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మల్టీస్టారర్ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటించే అవకాశం ఉండగా, రెండో హీరోయిన్‌గా కృతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే, కృతి శెట్టి కెరీర్‌కు ఇది గ్రాండ్ రీ-ఎంట్రీ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా ఎనర్జిటిక్‌గా, ఫన్నీగా ఉంటాయి కాబట్టి, ఇది కృతికి తన నటనను నిరూపించుకోవడానికి మంచి వేదిక అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చి కృతి శెట్టికి మళ్ళీ 'ఉప్పెన' లాంటి విజయం దక్కుతుందో లేదో చూడాలి.

