Kriti Sanon: విజయ్ దేవరకొండ సినిమాతో టాలీవుడ్‌కి కృతి సనన్ రీఎంట్రీ? నెపోటిజంపై బాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..

Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఇటీవల కాక్‌టెయిల్-2 చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి ఈ ముద్దుగుమ్మకు ఒక క్రేజీ బంపర్ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ , దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కృతి సనన్ కీలక పాత్రలో నటించనుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
మరోవైపు, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృతి సనన్ తన 12 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవ్వడంతో పాటు బాలీవుడ్‌లోని నెపోటిజం పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఫ్లాప్ ర్యాంప్ వాక్.. ఇంటికెళ్లి ఏడ్చాను..
తన సినీ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి కృతి మాట్లాడుతూ.. “ప్రారంభంలో నేను చాలా కష్టాలు పడ్డాను. మోడలింగ్ రోజుల్లో నా మొదటి ఫోటోషూట్, నా మొదటి ర్యాంప్ వాక్.. ఈ రెండూ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో తీవ్ర నిరాశకు లోనై ఇంటికి వెళ్లి ఎంతో ఏడ్చాను. కానీ ఎక్కడా ఆగిపోకుండా పట్టుదలతో మళ్లీ ఆడిషన్లు ఇచ్చాను. ఆ మొండి పట్టుదలే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది” అని చెప్పుకొచ్చింది.
టాలెంట్ లేకపోయినా 8-9 ఏళ్లు అవకాశాలా? నెపోటిజంపై ఫైర్!
సినీ పరిశ్రమలో ఉన్న పక్షపాతంపై కృతి సనన్ చాలా ఘాటుగా స్పందించింది. స్టార్ కిడ్స్ అయిన రణ్‌బీర్ కపూర్, అలియా భట్ లాంటి వారిలో నిజంగానే టాలెంట్ ఉందని, వారు కష్టపడి తమను తాము నిరూపించుకున్నారని ఆమె ప్రశంసించింది. అయితే ఇదే సమయంలో కొందరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “కనీసం టాలెంట్ లేని కొందరు నటీనటులు, కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉందనే ఒకే ఒక్క కారణంతో ఇండస్ట్రీలో 8 నుండి 9 ఏళ్ల పాటు వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ అన్యాయం. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే నటీనటులు మొదటి 2-3 ఏళ్లలోనే హిట్‌లు కొట్టకపోతే ఇండస్ట్రీ వారిని చాలా సులభంగా పక్కకు నెట్టేస్తుందని, కానీ స్టార్ కిడ్స్‌కు మాత్రం వరుసగా ఛాన్సులు ఇస్తారు" అని కృతి మండిపడింది. ప్రస్తుతం నెపోటిజంపై కృతి సనన్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

