‘Lisa’ : సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘లీసా’: షూటింగ్ పూర్తి చేసుకున్న అనన్య నాగళ్ల కొత్త సినిమా
అనన్య నాగళ్ల కొత్త సినిమా

‘Lisa’ : టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో దూసుకుపోతున్న యువ నటి అనన్య నాగళ్ల లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా సంచలన చిత్రం ‘లీసా’. జవహర్ పవార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకు సంబంధించి మేకర్స్ నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ పూరైనట్లు అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది.
ఈ సినిమా షూటింగ్‌ను కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన వంటి అద్భుతమైన, ప్రకృతి రమణీయమైన లొకేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. రెండు భిన్నమైన జానర్స్‌ను అద్భుతంగా మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని, థియేటర్లలో ఈ సినిమా అందరినీ కచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందిస్తున్న సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని, అలాగే అనన్య నాగళ్ల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్ర బృందం చెబుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి, ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను వచ్చే నవంబర్‌లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న 'లీసా' టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!

