Thiruveer: వర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ఓ.. సుకుమారి’. జులై 17న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా.. హీరో తిరువీర్ మీడియా ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సినిమా కథ చాలా వినూత్నంగా ఉంటుందని తిరువీర్ తెలిపారు. ఒక అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే.. ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుందట! అలాంటి విచిత్రమైన కండిషన్ ఉన్న అమ్మాయి లైఫ్‌లోకి ఓ అబ్బాయి వచ్చాక ఏం జరిగింది? వారి ప్రేమ కథ ఎలా సాగింది? అనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ఎంత నవ్విస్తుందో అంతే ఎమోషన్‌కు గురిచేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌తో కలిసి నటించడంపై మాట్లాడుతూ.. "గతంలో తనతో 'టక్ జగదీష్'లో నటించా. కో-స్టార్స్ మంచి పెర్ఫార్మర్స్ అయితే మనం ఇంకా బాగా నటించడానికి స్కోప్ ఉంటుంది. ఆ విషయంలో ఐశ్వర్య రాజేష్ లాంటి టాలెంటెడ్ నటితో పనిచేయడం ఒక ఛాలెంజింగ్‌గా అనిపించింది" అని చెప్పారు. అలాగే మహిళా ఆడియన్స్ తన పాత్రలను ఎక్కువగా ఆదరిస్తారని, ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతానని తిరువీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తన కెరీర్ చాలా కంఫర్టబుల్ ప్లేస్‌లో ఉందన్న తిరువీర్.. నెలకు దాదాపు 20 కథలు వింటున్నట్లు రివీల్ చేశారు. ఈ ఏడాది తన నుంచి వస్తున్న రెండో సినిమా ఇదని, ప్రస్తుతం 'భగవంతుడు' చిత్రంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఓ.. సుకుమారి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి!

PolitEnt Media

PolitEnt Media

Next Story