Sonakshi’s Interesting Comments: ప్రేమ గెలిచింది.. ద్వేషం ఓడింది.. సోనాక్షి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సోనాక్షి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Sonakshi’s Interesting Comments: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్‌ల వివాహం జరిగి ఏడాది దాటింది. గతేడాది జూన్‌లో ప్రత్యేక వివాహ చట్టం కింద ఒక్కటైన ఈ జంట, మతాంతర వివాహం కారణంగా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఈ ప్రయాణంపై, విమర్శలపై సోనాక్షి సిన్హా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ప్రేమ ముందు ద్వేషం ఎప్పుడూ ఓడిపోతుందని సోనాక్షి అన్నారు.
"ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. జనాలు ఎంత ద్వేషం చూపించినా, నిజమైన ప్రేమ దానిని అధిగమిస్తుంది. నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అంతే. నేనేమీ మతాంతర వివాహం చేసుకున్న మొదటి మహిళను కాదు, చివరి మహిళను కూడా కాదు. పెళ్లి తర్వాత తమ మధ్య ఉన్న నిజాయతీ, ప్రేమను ప్రజలు గమనించారని.. అందుకే ఆ ట్రోలింగ్, ద్వేషం వాటంతట అవే ఆగిపోయాయి’’ అని సోనాక్షి తెలిపారు.
గర్భం, బరువుపై పుకార్లకు సరదా సమాధానాలు
సోనాక్షి, జహీర్ ఇటీవల తమపై వచ్చిన పుకార్లకు చాలా సరదాగా సమాధానాలు ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు. దీపావళి పార్టీలో జహీర్, సోనాక్షిపై చేయి వేసి పోజివ్వడంతో ఆమె గర్భవతి అంటూ పుకార్లు వ్యాపించాయి. ఈ రూమర్స్‌పై జంట సరదాగా స్పందించింది. "కొన్ని అధ్యయనాల ప్రకారం, పెళ్లైన మొదటి సంవత్సరంలో జంటలు బరువు పెరుగుతారట. అది సంతోషకరమైన వైవాహిక జీవితానికి సంకేతం"** అంటూ సమాధానం ఇచ్చింది.

