Madarasi Public Talk: మదరాసి పబ్లిక్ టాక్..ఎలా ఉందంటే?
ఎలా ఉందంటే?

Madarasi Public Talk: శివ కార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన మదరాసి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయ్యింది. పబ్లిక్ నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్, తుపాకీ ఫేమ్' విద్యుత్ జమ్వాల్ విలన్ రోల్లో నటించాడు. మలయాళ నటుడు బిజు మీనన్, విక్రాంత్, షాబీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు
పాజిటివ్
శివ కార్తికేయన్ తన పాత్రలో చాలా బాగా నటించారని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నారని చాలామంది ప్రేక్షకులు చెబుతున్నారు. ఏఆర్ మురుగదాస్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కొంతవరకు బాగా ఉన్నాయని, కొన్ని సన్నివేశాలు ఉత్కంఠగా ఉన్నాయంటున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని, హై-ఆక్టేన్ యాక్షన్‌ను ఎంజాయ్ చేయవచ్చని కొందరు చెబుతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని ప్రశంసించారు.
నెగటివ్
సినిమా కథనంలో కొత్తదనం లేదని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయని, కథనంలో బలహీనతలు ఉన్నాయనిఅంటున్నారు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా మొదలవుతుందని, కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించాయని అభిప్రాయపడ్డారు. విలన్ పాత్రలు, ఇతర పాత్రల చిత్రీకరణ అంతగా బలంగా లేదని, అవి ఆకట్టుకోలేదని చెబుతున్నారు.
