స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

Mahavataar Narasimha: కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రసిద్ధ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. సుమారు రూ. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, విడుదలైన 8 రోజుల్లోనే రూ. 60.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనితో తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ యానిమేటెడ్ చిత్రంగా మహావతార్ నరసింహ రికార్డు సృష్టించింది. విడుదలైన 54 రోజుల్లోనే మొత్తం రూ. 250 కోట్ల వసూళ్లను సాధించి అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రం ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో సినిమాను చూడని ప్రేక్షకులు కూడా వీక్షించే అవకాశం లభించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story