Mahesh Babu as 'Kirayi Kotigadu': కిరాయి కోటిగాడుగా మహేష్ బాబు.. సందీప్ రెడ్డి వంగా ఏఐ వీడియో సంచలనం
సందీప్ రెడ్డి వంగా ఏఐ వీడియో సంచలనం

Mahesh Babu as 'Kirayi Kotigadu': టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో సెలబ్రేట్ అయ్యాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే, ఇదంతా ఒకెత్తయితే.. ట్రెండింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు నెట్టింట మంట పుట్టిస్తోంది. అదేంటో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం సందీప్ రెడ్డి వంగా ఒక అద్భుతమైన ఏఐ (AI) వీడియోను రూపొందించి మరీ బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చారు.లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన క్లాసికల్ హిట్ మూవీ ‘కిరాయి కోటిగాడు’ సినిమాలోని ఐకానిక్ డైలాగ్‌ను.. అచ్చం మహేష్ బాబు చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రీక్రియేట్ చేశారు వంగా. ఈ వీడియోలో మహేష్ బాబు స్టైలిష్‌గా బీడీ వెలిగిస్తూ.. సీరియస్ లుక్‌తో పేరు కోటిగాడు.. ఊరు తెనాలి. ఉద్యోగం కిరాయి తీసుకొని కాళ్లూ చేతులు విరగ్గొట్టడం.. ఈ వివరాలు చాలుగా అంటూ వార్నింగ్ ఇచ్చే విజువల్స్ అచ్చం రియల్‌లాగే అనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.
ఇక ఈ క్రేజీ వీడియోను చూసి సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. హాహాహా.. చాలా చాలా థ్యాంక్యూ సందీప్! నీపై ఎప్పటికీ ఎంతో ప్రేమ ఉంటుంది అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. దానికి సందీప్ వంగా స్పందిస్తూ.. నాకు ఆ పోస్టర్, ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం సర్ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ క్యూట్ అండ్ మాస్ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. కృష్ణ మేనరిజమ్స్‌ని మహేష్ బాబు రూపంలో ఏఐ ద్వారా తెరపైకి తెచ్చిన విధానం అద్భుతమంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చిత్రంతో బిజీగా ఉన్నారు మహేష్ బాబు.

