Mahesh Babu Praises Rao Bahadur: మహేష్ బాబు మెచ్చిన రావు బహదూర్.. సరికొత్త అనుభూతినిచ్చేలా సత్యదేవ్ కొత్త చిత్రం..
సత్యదేవ్ కొత్త చిత్రం..

Mahesh Babu Praises Rao Bahadur: ప్రస్తుతం రొటీన్ ఫార్ములా సినిమాలను ప్రేక్షకులు అస్సలు ఆదరించడం లేదు. ఆడియన్స్‌కు ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే సంకల్పంతోనే రావు బహదూర్ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి తెలిపారు. సత్యదేవ్, దీపా థామస్ జంటగా నటించిన ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా అవుట్‌పుట్ చూసిన మహేష్ బాబు ఎంతో ఆశ్చర్యపోయారని, ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదని ఆయన ప్రశంసించడం తమ నమ్మకాన్ని మరింత పెంచిందని నిర్మాత చెప్పారు.
నమ్రతకు నచ్చడంతో..
ఈ విలక్షణమైన కథను మొదట నమ్రత గారు విన్నారని, ఆమెకు కథ విపరీతంగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలిందని తెలిపారు. రావు బహదూర్ పాత్రకు సత్యదేవ్ వంద శాతం న్యాయం చేశారని కొనియాడారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా కథ, వేసిన సెట్స్, కాస్ట్యూమ్స్ ప్రేక్షకులకు బాహుబలి తరహా ఒక భారీ విజువల్ అనుభూతిని, పూర్తి వినోదాన్ని అందిస్తాయని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.

