టైటిల్, గ్లింప్స్ డేట్ ఎపుడంటే.?

Mahesh–Rajamouli Movie: మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్/టైటిల్ గ్లింప్స్ నవంబర్ 16న విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ రోజున సినిమా టైటిల్ , ఫస్ట్ గ్లింప్స్ (లేదా టీజర్) విడుదల చేస్తారని సమాచారం.ఈ అప్డేట్‌ను హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యే విధంగా ఒక గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాను ప్రస్తుతానికి SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే దీనికి "వారణాసి" లేదా "గ్లోబ్ ట్రాటర్" వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా పుకార్లు ఉన్నాయి. అయితే ఈ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి అభిమానులు అధికారిక ప్రకటన కోసం వేచి ఉండటం మంచిది.

ప్రియాంక చోప్రా హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story