మలైకా అరోరా..

Malaika Arora: రాజస్థాన్ లోని ఆదినాథ్ జైన్ ఆలయంలో బాలీవుడ్ నటి మలైకా అరోరా కనిపించడం మరోసారి చర్చకు దారి తీసింది. ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. ఆలయ దర్శనానికి సాధారణ తెలుపు దుస్తుల్లో వచ్చిన మలైకా, పక్కనే బ్లూ షర్ట్లో ఉన్న వ్యక్తితో కనిపించడంతో అక్కడే హడావిడి మొదలైంది. వార్త తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి నియంత్రణ తప్పకుండా ఉండేందుకు అధికారులు జోక్యం చేసుకుని జనాలను నియంత్రించారు.

ఇప్పటికే ముంబైలో జరిగిన ఓ కాన్సర్ట్ లో ఇద్దరూ కలిసి కనిపించడం, తర్వాత ఎయిర్ పోర్ట్ వద్ద కూడా ఒకే వాహనంలో వెళ్లడం వంటి ఘటనలు డేటింగ్ రూమర్ కు బలం చేకూర్చాయి. హర్ష్ మెహతా డైమండ్ వ్యాపారి అని సమాచారం. అయితే ఈ సంబంధంపై ఇప్పటివర కు మలైకా అరోరా గానీ, హర్ష్ మెహతా. గానీ అధికారికంగా స్పందించలేదు. గతంలో అర్జున్ కపూర్తో రిలేషన్లో ఉన్న మలైకా, 2024లో విడిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు అర్బాజ్ ఖాన్తో వివాహం చేసుకుని 2017లో విడాకులు తీసుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story