ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ..!

Malavika Mohanan: వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ సినిమాను నవంబర్ 5న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈమె ఇప్పటికే ప్రభాస్, విక్రమ్, మోహన్‌లాల్ వంటి స్టార్లతో పనిచేసింది.

ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిరాయ్ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.

చిరంజీవి పుట్టినరోజున ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వసిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రాన్ని పూర్తి చేశారు. మరోవైపు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా చివరి దశలో ఉంది. ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు పూర్తికాకముందే బాబీతో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెడుతుండటం ఆయన స్పీడ్‌ను తెలియజేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story