దిలీప్ కు ఊరట

Malayalam Actor Dileep: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌ను 2017లో ఒక హీరోయిన్‌పై జరిగిన లైంగిక వేధింపులు,అపహరణ కేసులో కుట్రదారుడు అనే అభియోగాల నుండి కోర్టు నిర్దోషిగా తేల్చింది.2017లో కొచ్చిలో కారులో ప్రయాణిస్తున్న నటిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన సంఘటన ఇది. ఈ నేరం వెనుక కుట్రదారుగా దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి.

ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు, దిలీప్‌పై మోపబడిన కుట్ర (Criminal Conspiracy) అభియోగాలను నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ, ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది.

ఈ కేసులో నేరుగా పాల్గొన్న ప్రధాన నిందితుడు పల్సర్ సునితో పాటు మరో ఐదుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది.

ఈ కేసులో దిలీప్ ను 2017లో పోలీసులు దిలీప్‎ను అరెస్ట్ చేయగా.. అదే సంవత్సరం అక్టోబర్‌లో అతనికి బెయిల్ లభించింది. ప్రస్తుతం అతను బెయిల్‎పై బయట ఉన్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో దిలీప్‌ను నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.ఈ కేసులో ఏ1 టూ ఏ6 నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. 2025, డిసెంబర్ 12న దోషులకు శిక్ష ఖరారు చేయనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story