క్యారెక్టర్ గుర్తుండిపోతుంది

Malayalam Actress Anaswara Rajan: మలయాళ నటి అనస్వర రాజన్, తెలుగులో పరిచయమవుతున్న మొదటి సినిమా 'ఛాంపియన్' (Champion) .శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా, జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ఈ సినిమాలో తాను పోషించిన 'చంద్రకళ' పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె పేర్కొన్నారు. ఈ పాత్రను ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయిగా, నాటక రంగంపై మక్కువ ఉన్న యువతిగా ఆమె అభివర్ణించారు.దర్శకుడు ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడు తాను చాలా ఎమోషనల్ అయ్యానని, ఒక మంచి సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయని ఆమె అన్నారు.

తన కో-స్టార్ రోషన్ చాలా అద్భుతమైన నటుడని, ముఖ్యంగా డ్యాన్స్ , డైలాగ్స్ విషయంలో తనకు ఎంతో సహకరించారని కొనియాడారు.

వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లలో తెలుగు ఎంట్రీ ఇవ్వడం తన అదృష్టమని, నిర్మాత స్వప్న దత్ తనకు ఒక అక్కలా అండగా నిలిచారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమాలోని 'గిర గిర గింగిరాగిరే',సల్లంగుండాలే' పాటలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తనను ఎంతో సంతోషపెట్టిందని ఆమె అన్నారు.

ఈ చిత్రం డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.ఇది స్వాతంత్ర్యానికి పూర్వం (ప్రీ-ఇండిపెండెన్స్) సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా.

PolitEnt Media

PolitEnt Media

Next Story