మలయాళ సినిమా 'సూత్ర వాక్యం'

Malayalam Film 'Sutra Vakyam': మలయాళ సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ భాష నుంచి వచ్చే కంటెంట్‌కు మంచి క్రేజ్ ఉండటంతో, తెలుగులో విడుదలవుతున్న సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన మలయాళ సినిమా 'సూత్ర వాక్యం' ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ రోజు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జులై 11న థియేటర్లలో విడుదలైంది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించిన కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి యూజియన్ జాస్ చిరమ్మల్ దర్శకత్వం వహించారు. షైన్ టామ్ చాకో ఇందులో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ వారి దగ్గరవుతాడు. అలాగే తన పట్ల నిమీషకు ఉన్న చెడు అభిప్రాయాన్ని కూడా మారుస్తాడు. కథ విషయానికొస్తే.. వివేక్ అనే కుర్రాడు కనిపించకుండా పోవడం, బెట్సి అనే అమ్మాయి చనిపోవడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఈ మిస్టరీకి కారణం ఎవరు అనే అంశం చుట్టూ సినిమా కథ నడుస్తుంది. ఈ తరహా కంటెంట్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి మార్కులు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story