Mamitha Baiju: మమిత బైజుకు భారీ స్టార్డమ్.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్
బ్లాక్‌బస్టర్

Mamitha Baiju: యువ కథానాయిక మమిత బైజు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. తమిళం, తెలుగు, మలయాళం.. ఇలా ఏ భాషలో చూసినా ఆమె పేరు వినిపిస్తోంది. వరుస అవకాశాలతో తన క్రేజ్‌ను పెంచుకుంటున్న మమితకు తాజాగా కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం ‘బెత్లహేం కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుని ఆమె స్టార్‌డమ్‌ను మరింత పెంచింది.
ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమాకు పెద్దగా స్పందన లభించలేదు. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినప్పటికీ.. తెలుగు వెర్షన్‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ రాలేదు. మరోవైపు మలయాళ వెర్షన్ మాత్రం అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచి, గతంలో ఉన్న పలు రికార్డులను అధిగమించినట్లు తెలుస్తోంది.
గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివిన్ పౌలీ వయసు పైబడిన బ్యాచిలర్ పాత్రలో నటించగా.. మమిత బైజు అతడిని ప్రేమించే యువ విద్యార్థిని పాత్రలో కనిపించింది. ఇద్దరి మధ్య ఉండే అసాధారణ వయసు వ్యత్యాసంతో కూడిన ప్రేమకథ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కథ, వినోదం, పాత్రల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో సినిమా ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఇక ఈ ఏడాది మమిత బైజుకు ఇది రెండో భారీ విజయం కావడం మరో విశేషం. ఇంతకుముందు ఆమె నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా మంచి విజయాన్ని అందుకుని ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో బలమైన ప్రభావాన్ని చూపించింది. వరుసగా రెండు విజయాలు అందుకోవడంతో మమిత బైజు దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న యువ కథానాయికల్లో ఒకరిగా వేగంగా ఎదుగుతోంది. ఇకపై ఆమెకు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

