భర్తకు మద్దతుగా చిన్మయి ఘాటు వ్యాఖ్యలు..

Chinmayi’s Sharp Remarks: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద భర్త.. నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రేగడంతో, చిన్మయి వాటిపై గట్టిగా స్పందించారు. సంప్రదాయాల పేరిట మహిళలను ప్రశ్నించేవారికి ఆమె ఘాటు సమాధానం ఇచ్చారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత మహిళలు తప్పనిసరిగా తాళి ధరించాలనే సంప్రదాయాన్ని తాను సమర్థించనని స్పష్టం చేశారు. అంతేకాక తన భార్య చిన్మయిని ఎప్పుడూ మంగళసూత్రం వేసుకోమని బలవంతం చేయలేదని ఆయన పేర్కొన్నారు.

చిన్మయి శ్రీపాద ఘాటు స్పందన

రాహుల్ వ్యాఖ్యలు వైరల్ అయ్యి, విమర్శలు ఎదురైన నేపథ్యంలో చిన్మయి ఎక్స్ ద్వారా స్పందించారు. సంప్రదాయం కంటే మహిళల భద్రత ముఖ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను, వేధింపులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించే వరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలాచోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన పసికందులపై దారుణాలు ఆగడం లేదు కదా?" అని అన్నారు. చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story