✕
Mangli: నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సినీ గాయకురాలు మంగ్లీ ఫిర్యాదు
By PolitEnt MediaPublished on
సినీ గాయకురాలు మంగ్లీ ఫిర్యాదు

x
Mangli: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రూ.150 కోట్ల మేర మోసం చేశారంటూ ప్రచారం చేస్తున్న న్యాయవాది సుభా సింగబోష్‌పై సినీ గాయకురాలు మంగ్లీ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.
మార్చి 21న ‘సుభా సియపోగు’ అనే పేరుతో తనను పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించాడని మంగ్లీ తన ఫిర్యాదులో వివరించారు. “అతడు అమర్యాదగా బెదిరించే తీరులో మాట్లాడాడు. నన్ను కలవాలని ఒత్తిడి చేశాడు. నిరాకరిస్తే అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరించాడు. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించాడు. సుభా సింగబోష్ తీరుపై నా కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు” అని మంగ్లీ స్పష్టంగా తెలిపారు.
నిందితులపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు.

PolitEnt Media
Next Story
