Mani Ratnam and Vijay Combo: స్టార్ నటుడు విజయ్ సేతుపతి, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో తొలిసారి ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ రొమాంటిక్ డ్రామాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా చిత్ర బృందం తొలి షూటింగ్ షెడ్యూల్ కోసం కోల్‌కతాకు చేరుకుంది. అక్కడే సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పూర్తిగా క్లీన్ షేవ్‌తో, యంగ్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. మెచ్యూర్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను కోల్‌కతాతో పాటు పుదుచ్చేరి, విశాఖపట్నం వంటి అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు.

నిర్మాణ వ్యయాన్ని నియంత్రించేందుకు మొత్తం చిత్రీకరణను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందించింది. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిరత్నం మార్క్ కథనం, విజయ్ సేతుపతి–సాయి పల్లవి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇక మణిరత్నం గత చిత్రం 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో కీలకంగా మారింది. ఈ చిత్రంతో మరోసారి ఘన విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో మణిరత్నం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story