విజయ్ సేతుపతి, సాయి పల్లవి జోడీతో రొమాంటిక్ డ్రామా

Mani Ratnam Magic Returns: వెండితెరపై అద్భుతమైన ప్రేమకథలను ఆవిష్కరించడంలో దిట్ట అయిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం.. మరో సరికొత్త లవ్ స్టోరీకి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవిలను ఎంచుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది.

షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ ఇదే..

ఈ సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి.ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రోమో చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. వేసవి సెలవుల అనంతరం, అంటే జూన్ నెలలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఇంకా పేరు నిర్ణయించని ఈ రొమాంటిక్ డ్రామాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. మణిరత్నం మార్కు మేకింగ్‌తో, సేతుపతి-సాయి పల్లవి లాంటి పర్ఫార్మర్ల కలయికలో వస్తున్న సినిమా కావడంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

బిజీగా ఉన్న స్టార్స్

ప్రస్తుతం ఈ ఇద్దరు తారలు తమ సొంత ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి స్లమ్ డాగ్, పాకెట్ నోవెల్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. సాయి పల్లవి హిందీలో భారీ చిత్రం రామాయణ తో పాటు ఏక్ దిన్ వంటి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story