నిధి అగర్వాల్ క్యూట్ రిప్లై!

Nidhhi Agerwal: టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అందాల భామ నిధి అగర్వాల్.. తెలుగులో 'సవ్యసాచి' తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలతో హిట్ అందుకుంది. ప్ర స్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది ఈ చిన్నది. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో నటించే చాన్స్ కొట్టే సింది. వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహరవీర మల్లు. దీని కోసం నిధి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలాంటివి నేర్చుకుంది. ఈ మూవీ త్వ రలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా స్పీడ్ గా జరుగుతుంది. మరోవైపు వెంకటేశ్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందనున్న చి త్రానికి కూడా నిధిని హీరోయిన్ గా ఫైనల్ చేశారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తన పాత్రకు గుర్తింపు లభిస్తే పాన్‌ ఇండియా రేంజ్లో నిధి అగర్వాల్‌ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ 2025 సంవత్సరం నిధి అగర్వాల్‌ కి అత్యంత కీలకం. మరి ఆమె లక్‌ ఈ ఏడాదితో మారుతుందా అనేది చూడాలి. ఇక మూవీలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అభిమా నులతో అప్పుడప్పుడూ ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు 'ఆస్క్ నిధి' అంటూ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. నెటిజన్స్ అంతా నిధి హీరోయిన్ గా చేస్తున్న ‘హరి హర వీరమల్లు' సినిమా విశేషాలు అడిగారు. కానీ ఓ ఫ్యాన్ మాత్రం మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చా డు. 'మీ అమ్మగారి నెంబర్ ఇవ్వండి. మన పెండ్లి సంబంధం గురించి మాట్లాడతా. ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి' అంటూ హార్ట్ ఎమోజీతో రి క్వెస్ట్ చేశాడు. దానికి నిధి అగర్వాల్ నవ్వుతూ 'అవునా? నాటీ'.. అంటూ క్యూట్ గా రిప్లై ఇచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story