Ashu Reddy Warns: పెళ్లి పేరుతో 9.35 కోట్ల మోసం? .. లీగల్ యాక్షన్ తప్పదంటూ అషు రెడ్డి వార్నింగ్
లీగల్ యాక్షన్ తప్పదంటూ అషు రెడ్డి వార్నింగ్

Ashu Reddy Warns: సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ఒక భారీ వివాదం ముసురుకుంది. పెళ్లి పేరుతో దాదాపు 9.35 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలు నెట్టింట వైరల్ కావడంతో ఎట్టకేలకు అషు రెడ్డి ఈ విషయంపై స్పందించింది.
అసలు ఆమె ఏమందంటే..
తనపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అషు రెడ్డి స్పష్టం చేసింది. తన పేరును వాడుకుంటూ కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడింది. ముఖ్యంగా 9 కోట్ల రూపాయల మోసం అనే వార్త తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన వెర్షన్ ఏంటో తెలుసుకోకుండా, తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా కథనాలు అల్లడంపై ఆమె తీవ్రంగా స్పందించింది.
కేవలం వ్యూస్ కోసం లేదా తన ప్రతిష్టను దిగజార్చడం కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని అషు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించింది. తన లీగల్ టీమ్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని గమనిస్తోందని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది.
ఒక సెలబ్రిటీగా తనపై విమర్శలు రావడం కొత్తేమీ కాకపోయినా, ఇలాంటి ఆర్థిక పరమైన నేరారోపణలు,వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తప్పుడు వార్తలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆమె పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని తన అభిమానులను కోరింది. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

