Mass Jathara: మాస్ జాతర: రవితేజ-శ్రీలీలల మధురమైన కెమిస్ట్రీ.. 'హుడియో హుడియో' పాట విడుదల!
'హుడియో హుడియో' పాట విడుదల!

Mass Jathara: తెలుగు సినిమా ప్రేక్షకుల్లో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకునే 'మాస్ జాతర' చిత్రం ప్రీ-రిలీజ్ పాటలతోనే సంచలనం సృష్టించింది. ఇప్పటికే 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' లాంటి హిట్ ట్రాక్‌లు వైరల్ అవుతూ రాక్ చేశాయి. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన మూడవ పాట 'హుడియో హుడియో' మెలోడీస్ మ్యాజిక్‌తో అందరి హృదయాల్లో స్థానం చేసుకుంది. మాస్ బీట్స్‌తో మెలోడీస్‌ను సమతుల్యం చేసిన ఈ గీతం, సినిమాటోగ్రఫీతో కలిసి అందరినీ కట్టిపడేస్తోంది..
మాస్ మహారాజా రవితేజ తన 75వ సినిమాలో మరోసారి మాస్-క్లాస్ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ పాటలో శ్రీలీల సొగసైన నటన, డ్యాన్స్‌తో తెర మీద వెలుగులు వెదజల్లారు. రవితేజ-శ్రీలీలల మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఈ రొమాంటిక్ మెలోడీ మరింత రసవత్తరత్వాన్ని జోడించింది. దేవ్ రచించిన పాటలు హృదయాన్ని తాకుతుండగా, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి తానే ఆలపించారు. వారితో పాట సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ కూడా గొంతు కలిపి పాడారు. ఈ డ్యూయెట్ సపోర్ట్‌తో పాట ఇంకా ఆకర్షణీయంగా మారింది.
భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సై రాజేష్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే సమయం నిర్ణయించారు. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ప్రేక్షకుల్లో గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రేకెత్తిస్తోంది.
