Mass Maharaja in Ayyappa Deeksha: అయ్యప్ప మాలలో మాస్ మహారాజా.. ఇరుముడి ఫస్ట్ లుక్ రిలీజ్!
ఇరుముడి ఫస్ట్ లుక్ రిలీజ్!

Mass Maharaja in Ayyappa Deeksha: మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఇది వరకు ఎన్నడూ చూడని ఒక కొత్త అవతారాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఆవిష్కరించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ఈ సినిమాకు ఇరుముడి అనే ఆధ్యాత్మిక ఎమోషనల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప స్వామి మాల ధరించి, నుదుట విభూతి, మెడలో రుద్రాక్షలు, భుజాన ఇరుముడితో కనిపిస్తున్నారు. ఒక పక్క ఆధ్యాత్మికత, మరోపక్క తనదైన చిరునవ్వుతో రవితేజ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఒక చిన్నారిని ఎత్తుకుని ఉన్న రవితేజను చూస్తుంటే, ఈ సినిమాలో తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే బలమైన ఎమోషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అర్థమవుతోంది.
ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు. ఫ్యామిలీ డ్రామా మరియు మాస్ ఎలిమెంట్స్‌ను కలిపి శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

