Mass Maharaja’s New Film Titled “Irumudi”: ఇరుముడి టైటిల్ తో మాస్ మహారాజా కొత్త సినిమా ఫస్ట్ లుక్
మాస్ మహారాజా కొత్త సినిమా ఫస్ట్ లుక్

Mass Maharaja’s New Film Titled “Irumudi”: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇది బిగ్ అప్‌డేట్! జనవరి 26న తన పుట్టిన రోజు సందర్భంగా తన కెరీర్‌లో 75వ సినిమాగా (RT75) తెరకెక్కుతున్న చిత్రానికి అధికారికంగా ఇరుముడి అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి శివ నిర్హాణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
టైటిల్ పోస్టర్‌లో రవితేజ లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. భక్తి వెనుక ఒక శక్తి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. రవితేజ మార్కు కామెడీతో పాటు, అయ్యప్ప మాల నియమాలు, ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ఈ సినిమాలో చూడబోతున్నాం.
ఇది పూర్తిగా శబరిమల అయ్యప్ప స్వామి భక్తి , మాస్ యాక్షన్ అంశాల చుట్టూ తిరుగుతుందని టైటిల్ సూచిస్తోంది. రవితేజ ఒక అయ్యప్ప మాలధారిగా కనిపిస్తారనే వార్త సినిమాపై అంచనాలను పెంచేసింది.

