ఉస్తాద్ నుంచి మాస్ బీట్ రిలీజ్

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌‌‌ సింగ్‌‌‌‌’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. మార్చి 19న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలవగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా’ అంటూ సాగే మూడో పాటను గురువారం రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్‌‌‌‌గా కంపోజ్ చేసిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ ఇన్‌‌‌‌స్పైరింగ్ లిరిక్స్ అందించాడు. రామ్ మిరియాల పాడిన విధానం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారు వేసిన డ్యాన్స్‌‌‌‌కి చప్పట్లు, ఈలలతో సెట్ అంతా దద్దరిల్లిపోయింది. దాదాపు రెండు వేల మందితో భారీ సెట్‌‌‌‌లో ఈ పాటను చిత్రీకరించాం. అందర్నీ అలరించేలా ఈ సాంగ్ ఉంటుంది’ అని అన్నారు. హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో నటించాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం మరింత ఆనందంగా ఉంది’ అని చెప్పింది. ‘గబ్బర్ సింగ్‌‌‌‌’ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారని నిర్మాత రవిశంకర్ యలమంచిలి అన్నారు. ఈ ఉగాది పండుగను ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరింత ఉత్సాహంగా జరుపుకుందాం అని లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story