అదిరిపోయే అప్ డేట్

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ నటించిన'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సినిమా షూటింగ్‌తో పాటుగా ఎడిటింగ్ పనులను కూడా ఏకకాలంలో పూర్తి చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది.ఇటీవల సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఎడిటింగ్ పనులు మొదలుపెట్టినట్టు చిత్రబృందం ప్రకటించింది. దర్శకుడు హరీష్ శంకర్ షూటింగ్‌లో మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తూనే, ఎడిటింగ్ వర్క్‌ను కూడా పర్యవేక్షిస్తున్నారు.

ఈ సినిమాకు ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ తన మిగిలిన సన్నివేశాలను కూడా త్వరగా పూర్తి చేయనున్నారు. నిర్మాత నవీన్ యెర్నేని తెలిపిన వివరాల ప్రకారం, పవన్ కళ్యాణ్ కోసం ఇంకా ఒక వారం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మొత్తం సినిమా షూటింగ్ మరో 25 రోజుల్లో పూర్తవుతుందని అంచనా.

సినిమా షూటింగ్, ఎడిటింగ్ పనులు ఈక్వల్ గా జరుగుతుండటంతో, సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం ఉంది.ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. సినిమా విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా భారీ విజయం సాధించడంతో, 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story