Meenakshi Chaudhary: మెగా 158లో మీనాక్షి చౌదరి? బాబీ-చిరు ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్..
క్రేజీ రోల్..

Meenakshi Chaudhary: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 (వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫిలింనగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాలో యువ కథానాయిక మీనాక్షి చౌదరి ఒక ప్రత్యేక పాత్రలో అలరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కీలకమైన అతిథి పాత్రలోనే?
చిత్రబృందం మీనాక్షి చౌదరిని ఈ సినిమాలోని ఒక విశేషమైన పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇందులో ప్రధాన కథానాయికగా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన గెస్ట్ రోల్‌లో కనిపించనుందని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె పాత్ర ఎంటర్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిస్థాయి హీరోయిన్ పై సస్పెన్స్
మరోవైపు ఈ సినిమాలో అసలు మెయిన్ హీరోయిన్ ఎవరనే దానిపై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో చిరు సరసన ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర ఉంటుందా లేదా అనే దానిపై అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది.
ఈ డిసెంబర్‌లోనే విడుదల target
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎంతో ఘనంగా నిర్మితమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్‌లోనే సినిమాను ప్రేక్షకు ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా మీనాక్షి చౌదరి ఎంట్రీకి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

