Meenakshi Chaudhary: టాలీవుడ్ లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి ఇప్పుడు నేషనల్ వైడ్ ఫేమ్ కోసం సిద్ధమైపోతోంది. వరుస హిట్లతో తెలుగులో బిజీగా ఉన్న ఈ భామ, ఇప్పుడు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సరసన నటించే బంపర్ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. 2006లో వచ్చిన కల్ట్ కామెడీ థ్రిల్లర్ భాగమ్ భాగ్‌ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రియదర్శన్ మార్క్ కామెడీతో సాగిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ బాధ్యతలను దర్శకుడు రాజ్ శాండిల్య భుజానికెత్తుకున్నారు.

ఈ భారీ ప్రాజెక్టులో మీనాక్షి చౌదరితో పాటు ధురంధర్ స్పెషల్ సాంగ్ ఫేమ్ ఆయేషా ఖాన్ కూడా కథానాయికగా నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

సక్సెస్ ట్రాక్‌లో మీనాక్షి

ఈ ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రంలో చారులతగా అలరించిన మీనాక్షి, ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వృషకర్మలో మీనాక్షి కీలక పాత్ర పోషిస్తోంది. అక్షయ్ కుమార్ లాంటి అగ్ర హీరో సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Next Story