ఫ్యాన్స్ కు పండగే

Mega 157 Title Glimpse: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి వరుస అప్ డేట్ లు వస్తున్నాయి. ఫ్యాన్స్ కు నిన్న విశ్వంభర నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చింది టీం. ఇవాళ చిరంజీవి బర్త్ డే సందర్బంగా (ఆగస్టు 22, 2025), డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న మెగా 157 సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే పేరును ఫిక్స్ చేశారు. వీడియోలో వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో చిరంజీవి ఎంట్రీ అదిరిపోయింది. చాలా గ్రాండ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంది.

ఈ టైటిల్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి తీసుకున్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్‌తో పాటు "పండగకు వస్తున్నారు" అనే క్యాప్షన్ కూడా ఆకట్టుకుంది.

అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారని గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.

చిరుకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. చిరంజీవితో కలిసి నయనతార నటించడం ఇది మూడోసారి. సైరా నరసింహా రెడ్డి మూవీలో చిరుకు భార్యగా నటించగా.. ఆ తర్వాత గాడ్ ఫాదర్ (2022)లో సిస్టర్ క్యారెక్టర్ చేసింది. ఇపుడు ఇది మూడోసారి. ఈ సినిమా 2026 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story