Mana Shankar Varaprasad : మెగా బ్లాక్ బస్టర్ రూ. 300 కోట్ల క్లబ్ లోకి మన శంకర వరప్రసాద్ గారు
రూ. 300 కోట్ల క్లబ్ లోకి మన శంకర వరప్రసాద్ గారు

Mana Shankar Varaprasad : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మొదటి వారం మంచి వసూళ్లను కొనసాగించడమే కాకుండా, బ్రేక్ ఈవెన్ సాధించడంతో అనేక మైలురాళ్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు చేరువలో ఉండగా, ఉత్తర అమెరికాలో అతి తక్కువ టైమ్‌లోనే 3 మిలియన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని చోట్లా అద్భుతమైన ఆక్యుపెన్సీలతో రెండవ వారంలోకి ఎంటర్ అయ్యిందని, ఈ వేగంతో ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా పయనిస్తోందని నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల అన్నారు.
ఈ సినిమా మొదటి వారం (7 రోజులు) ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.ఇండియా నెట్ కలెక్షన్స్ సుమారు రూ.158 కోట్లు (ఇది చిరంజీవి గారి గత చిత్రాలైన 'వాల్తేరు వీరయ్య', 'సైరా' రికార్డులను అధిగమించింది). అమెరికా , ఇతర దేశాల్లో కలిపి దాదాపు $4.5 మిలియన్ల (సుమారు రూ.37 కోట్లు) వసూళ్లను రాబట్టింది.
2026 సంక్రాంతి రేసులో భారీ పోటీ ఉన్నప్పటికీ, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్,మెగాస్టార్ మాస్ క్రేజ్ తో ఈ సినిమా "సంక్రాంతి విన్నర్" గా నిలిచింది. కేవలం రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.ఈ సినిమాలో చిరంజీవి ఒక సెక్యూరిటీ ఆఫీసర్‌గా నటించగా, ఆయన మార్క్ కామెడీ , యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విక్టరీ వెంకటేష్ గారి అతిథి పాత్ర ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

